.
..రాజీవ్ కాలనీలో… సిమెంటు రోడ్డుకు భూమి పూజ.
.. మండల అక్కన్వీనర్ బాలకృష్ణ చౌదరి చేతులమీదుగా పనులు ప్రారంభం.
..పాల్గొన్న హస్తకళల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్.
సీమ వార్త అప్డేట్ న్యూస్…
గోరంట్ల పట్టణం లోని రాజీవ్ కాలనీలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి, గోరంట్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగే నాయక్ చేతులు మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు హస్తకళల కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఇందులో భాగంగా మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి సవితమ్మ రాజీవ్ కాలనీ కి విచ్చేసిన సందర్భంలో స్థానిక పరిస్థితులను గమనించి 24 గంటల్లోనే సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. స్థానిక పంచాయతీ రూ, 2.50 లక్షల నిధులతో రోడ్డు పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీధర్, మాజీ సర్పంచ్ నరేష్,ఉత్తమ రెడ్డి, గిరిధర్ గౌడ్, అజంతుల్లా, జయరాం,పసుపులేటి శ్రీనివాసులు, జనసేన పాగుతోట వెంకటేష్, చిలమత్తూరి వెంకటేష్, మునిస్వామి, గుమ్మయ్య గారి పల్లి ప్రకాష్, సుబ్బరాయుడు, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.