ఈత కెళ్ళి యువకుడు మృతి…. శరీరంపై గాయాలు..??
గోరంట్ల మార్చి 19 సీమ వార్త
గోరంట్ల మండలంలోని వడిగేపల్లి పంచాయతీ పరిధిలోని బోయలపల్లి గ్రామ సమీపంలోని చెరువులో పడి సుదర్శన్ (20)అనే యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే మృతునికి మతిస్థిమితం లేక ఇలా జరిగి ఉంటుందని కుటుంబీకులు తెలుపుతున్నప్పటికీ శరీరంపై కొన్ని గాయాలు ఉండడంతో పలు అనుమానాలు రేకుతీస్తున్నాయి.