Tuesday, March 3, 2026
Homeసీమా వార్త"కలం" పై "ఖద్ధర్ " ప్రేమ.

“కలం” పై “ఖద్ధర్ ” ప్రేమ.

📰 Generate e-Paper Clip

“కలం” పై…”ఖద్దర్” ప్రేమ.

….. నిమ్మల శ్రీధర్ ఔదార్యం…. పోలీసులకు, జర్నలిస్టులకు నూతన వస్త్రాలు పంపిణీ.

…. గోరంట్ల పాత్రికేయులకు దసరా కానుకలు అందజేసిన…..టిడిపి నేత నిమ్మల శ్రీధర్.

…. హస్తకళలా స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్, నిమ్మల శ్రీధర్, పులేరు నరేష్,నాగే నాయక్ చేతుల మీదుగా అందజేత.

సీమ వార్త బ్రేకింగ్ న్యూస్…

రాజకీయాలు అంటే సమాజ సేవలో ఒక భాగమని అందులో నేను ఒక భాగస్వామి అని నిరూపించుకుంటున్నాడు గోరంట్ల పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత, సమాజ సేవకుడు, గోల్డ్ షాప్ యజమాని నిమ్మల శ్రీధర్. దసరా పండుగను పురస్కరించుకొని తను చేస్తున్న సమాజ సేవలో భాగంగా పట్టణంలోని పోలీసులకు మరియు గోరంట్ల జర్నలిస్టులకు నిమ్మల శ్రీధర్ నూతన వస్త్రలను మరియు స్వీట్ లను అందజేసి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోరంట్ల పట్టణంలోని నిత్యశ్రీ జ్యువెలరీ షాప్ వద్ద హస్త కళల స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్, పులేరు నరేష్, ఉత్తమ రెడ్డి, నాగే నాయక్, సింగిల్ బిండో అధ్యక్షులు రవి మోహన్, బిజెపి మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్,ఉమర్ ఖాన్, నబీ రసూల్,గిరిధర్ గౌడ్,అజంతుల్లా, జయరాం, పసుపులేటి శ్రీనివాసులు, కురుబ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు, మహేంద్ర, సుభహన్, మరెడ్డి పల్లి నరసింహులు, మామిడికాయల హరి, డీలర్ మల్లేష్, రమేష్, కలీం, శ్రీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular