సీమ వార్త బ్రేకింగ్…..
గోరంట్ల జులై 26 సీమ వార్త.
గోరంట్ల పట్టణంలో పానీపూరి వ్యాపారం ద్వారా జీవనం సాగిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి జోగేంద్ర సింగ్ (35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకెళితే ఉత్తరప్రదేశ్ కు చెందిన జోగేంద్ర సింగ్ గత కొంతకాలంగా గోరంట్ల పట్టణంలో నివాసం ఉంటూ భార్య పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తన నివాసంలో ఉడివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రేఖా రాణి, పిల్లలు హాన్స్, ఈసు లు ఉన్నారు.శనివారం రాత్రి కుటుంబంలో జరిగిన చిన్నపాటి వాగ్దివాదానికి క్షణికావేశానికి లోనై ఉరి వేసుకున్నట్లు సమాచారం. పోలీసుల దర్యాప్తులో వాస్తవ విషయాలు తెలియాల్సి ఉంది.
