Sunday, May 31, 2026
Homeసీమా వార్తఅసెంబ్లీ బూత్ కమిటీ ఉపాధ్యక్షులుగా… కలగేరి శ్రీనివాస్ రెడ్డి

అసెంబ్లీ బూత్ కమిటీ ఉపాధ్యక్షులుగా… కలగేరి శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

అసెంబ్లీ బూత్ కన్వీనర్ ఉపాధ్యక్షులుగా… కలగేరి శ్రీనివాస్ రెడ్డి.

… అభినందనలు తెలిపిన పంచాయతీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి.

గోరంట్ల  సీమ వార్త.అప్డేట్…

గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీ పరిధిలోని కలగేరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీ శ్రీనివాస్ రెడ్డిని పెనుగొండ నియోజకవర్గం బూత్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
పెనుగొండ పట్టణంలోని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ నివాసంలో శనివారం జరిగిన నియోజకవర్గస్థాయి బూత్ కమిటీల ప్రత్యేక సమావేశంలో కలగేరి కేసి శ్రీనివాస్ రెడ్డిని నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా ఆమె ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మండల అధ్యక్షులు వెంకటేష్, పట్టణ అధ్యక్షులు మేదర శంకర, మల్లాపల్లి పంచాయతీ కన్వీనర్ రామకృష్ణ రెడ్డి లకు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు రోజుల్లో గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం రాజీలేని పోరాటం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలగేరి సుబ్బిరెడ్డి, అశ్వత్థ రెడ్డి, మోట్రపల్లి బాలరాజు, కలగేరి సోము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular