Monday, April 20, 2026
Homeసీమా వార్తనిమ్మల ఇంట చంద్రన్న సంబరాలు

నిమ్మల ఇంట చంద్రన్న సంబరాలు

📰 Generate e-Paper Clip

… టిడిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మల అంబరీష్, నిమ్మల కిష్టప్ప ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు.

సీమ వార్త APP అప్డేట్…

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, రాష్ట్ర కార్యదర్శి నిమ్మల అంబరీష్ ల ఆధ్వర్యంలో వందలాది జనం మధ్య సంబరాలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని నిమ్మల కిష్టప్ప నివాస ప్రాంగణంలో ప్రత్యేకంగా తయారు చేసిన 76 కేజీల కేకును టిడిపి రాష్ట్ర కార్యదర్శి నిమ్మల అంబరీష్ చేతుల మీదుగా కట్ చేసి సంబరాలు చేశారు.

అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని రోగులకు పాలు బ్రేడ్ లు పంపిణీ చేసి తమ సేవ భావాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిమ్మల చంద్రశేఖర్,మాజీ మండల కన్వీనర్ సుబ్రహ్మణ్యం, పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి, ఆగిశం నాగరాజు, పసుపులేటి శ్రీనివాసులు, సింగిరెడ్డిపల్లి బాబు, గౌరాపురం శ్రీనివాసులు, ఎల్ ఎన్ నారాయణస్వామి, వెంకట రంగారెడ్డి, ఈడిగ నంజుండప్ప, గుంటి పల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular