కాషాయ దళ నేత లక్కీ కి కాలనీ యువత సన్మానం.
… బిజెపి మండల అధ్యక్షుడు బోయ లక్ష్మీనారాయణ సన్మానించిన రాజీవ్ కాలనీవాసులు.
…. వేడుకలకు విరాళం అందజేసి మానవత్వం చాటుకున్న వైనం.
గోరంట్ల సీమ వార్త అప్డేట్ న్యూస్
గోరంట్ల పట్టణంలోని రాజీవ్ కాలనీ యూత్ పిలుపుమేరకు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని 5, 000వేల రూపాయలు అందజేసిన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ, పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులు అన్నదానం చేయడం జరిగింది రాజీవ్ కాలనీ యువత మరియు మహిళ లు బోయ లక్ష్మీనారాయణ ను దుశ్యాలువులతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బజంత్రీ శంకర, రాజీవ్ కాలనీ నరసింహులు, శ్యామ్, నవీన్, అంజి, రాజీవ్ కాలనీ యువత మహిళలు పాల్గొన్నారు
