Wednesday, July 29, 2026
Homeసీమా వార్తTDP కార్యకర్త చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

TDP కార్యకర్త చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

….బూచేపల్లిలో చింత చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి మృతి.

సీమ వార్త బ్రేకింగ్ న్యూస్… గోరంట్ల

మండలంలోని బూచేపల్లి గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన శివ శంకర్(49) అనే వ్యక్తి చిత్తచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. మృతునికి భార్య సుజాత తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి.బూచేపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ గత కొద్ది రోజులుగా గోరంట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా ఒక టి దుకాణాన్ని నిర్వహించు కుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. అయితే బుధవారం రోజువారి కార్యక్రమంలో భాగంగా తన భార్యతో కలిసి హోటల్లో ఉంటూ పాలసముద్రం వద్దగల గ్రేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో తన కుమారుడు చదువుతున్న నేపథ్యంలో ఆ కుమారుని పలకరించి అనంతరం స్వగ్రామానికి వెళ్లి వస్తానని వారికి చెప్పి వెళ్లినట్లు తెలుస్తోంది.అయితే స్వగ్రామంలో ఊరి చివర గల సొంత పొలం వద్ద వరకు ద్విచక్ర వాహనంలో వెళ్లి చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.పోలీసుల విచారణలో వాస్తవ విషయాలు వెలుగు చూడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular