Monday, March 2, 2026
Homeసీమా వార్తప్రాణం తీసిన ఓవర్ డ్యూటీ

ప్రాణం తీసిన ఓవర్ డ్యూటీ

📰 Generate e-Paper Clip

గోరంట్ల సీమ వార్త న్యూస్ అప్డేట్..

…. పాపిరెడ్డి పల్లి బస్ స్టాప్ వద్ద… కాగానపల్లి వ్యక్తి మృతి.

…. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చోటు చేసుకున్న ప్రమాదమా..!!

తన కుటుంబ జీవనం కోసం చేస్తున్న ఉద్యోగంలో ఓవర్ డ్యూటీకి వెళుతూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురై పోయి ఒకడు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోరంట్ల మండలంలోని బూదిలి పంచాయతీ పరిధిలోని కాగానపల్లి గ్రామానికి చెందిన రమేష్(35) దుర్మరణం పాలయ్యడు. మృతునికి భార్య లత తోపాటు ఒక ఏడాది వయసు గల కుమారుడు గగన్ ఉన్నాడు. వివరాల్లోకెళితే కాగానపల్లి గ్రామానికి చెందిన రమేష్ గత కొంతకాలంగా చిలమత్తూరు మండలం కోడూరు వద్దగల మేడా ఇంటెక్స్ ప్రవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ వస్తున్నాడని, అయితే రోజువారి విధి నిర్వహణలో భాగంగా గురువారం ఉదయం ఈరోజు నాకు ఓవర్ డ్యూటీ ఉందని ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంలో బయలుదేరి వచ్చాడని మార్గమధ్యంలోని పాపిరెడ్డిపల్లి బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడ్డ రమేష్ ను ఊటా ఊటిన 108 ద్వారా గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందినట్లు స్థానిక డాక్టర్ తేజస్విని నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని వాస్తవ విషయాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular